Thursday, March 12, 2026

నేడు తెలంగాణ‌లో అతి భారీ వ‌ర్షాలు

Must Read

నేడు తెలంగాణ‌లో ప‌లు జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ అయ్యింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -