Saturday, August 30, 2025

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

Must Read

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ దండయాత్ర చేయనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు (ఆగస్టు 7) నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు. ఆగస్టు 8న‌ యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. ఆగస్టు 9న‌ కుమురం భీం, నిజామాబాద్, నిర్మల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయ‌న్నారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనేవారు, రవాణా, గిరిజన ప్రాంతాల్లో నివసించేవారు వాతావరణ హెచ్చరికలపై దృష్టి పెట్టాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -