ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై ఆర్థిక నేరాల విభాగం (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అంబానీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆగస్టు 1న ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం రిలయన్స్ గ్రూప్‌కి చెందిన 50 కంపెనీలు, 25 మందికి సంబంధించిన ముంబైలోని 35 చోట్ల ఈడీ దాడులు జరిపింది. ఈ దర్యాప్తు సీబీఐ దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా కొనసాగుతోంది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లాంటి అనిల్ అంబానీకి చెందిన సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాల వినియోగంపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.