బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సందర్భంగా పదవి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తనకు పదవి దక్కకపోవడంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో రాంచందర్ రావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.