Tuesday, July 1, 2025

విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్‌

Must Read

ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఈ నోటీసుల‌పై స్పందించారు. ఏసీబీ నోటీసులు అందినట్లు తెలిపారు. తాను ఈ నెల 28న విచారణకు హాజరు కాలేనంటూ చెప్పుకొచ్చారు. ముందస్తు ప్లాన్ లో భాగంగా యూకే, అమెరికాలో పర్యటించాల్సి ఉండటంతో ఆ తర్వాత హాజరు అవుతానని ఏసీబీకి సమాధానం ఇచ్చారు. కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై ఏసీబీ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

కేటీఆర్‌కు అండ‌గా ఉంటాం – హ‌రీష్ రావు

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుల‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు అభద్రతకు స్పష్టమైన సంకేత‌మ‌ని పేర్కొన్నారు. కల్పిత కేసులు కోర్టులో నిలబడవు అని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవు అని స్ప‌ష్టం చేశారు. కేటీఆర్‌కు అండ‌గా ఉంటామ‌ని, సత్యమే గెలుస్తుంద‌ని, సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ పోస్టును రీపోస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -