Tuesday, April 28, 2026

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Must Read

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చ‌దువుతున్న కృష్ణ‌వేణి శ‌నివారం ఉద‌యం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి ఉన్న‌ట్లు స‌మాచారం. కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా? లేదా కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కృష్ణ‌వేణి స్వ‌స్థ‌లం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -