Tuesday, January 27, 2026

ఏపీలో రాజ్య‌స‌భ స్థానానికి ఈసీ నోటిఫికేష‌న్‌

Must Read

ఏపీలో మరో ఎన్నికకు న‌గారా మోగింది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవ‌ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ స్థానం కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాయిరెడ్డి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ స్థానానికి ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. ఏప్రిల్ 30వ తేదీన నామినేషన్లు పరిశీలించి, మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వ‌నున్నారు. మే 9వ తేదీన రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వ‌హించి ఫలితాలు వెల్ల‌డిస్తారు. సంఖ్యా బలం ఆధారంగా ఎంపీ స్థానం కూటమి ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంద‌ని తెలుస్తున్నాది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -