యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కులు చెట్లుగా ఎదిగి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి.