గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో ఆ దేశంలోని స్వలింగ సంపర్కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.