Tuesday, April 28, 2026

UPSC సివిల్స్ పరీక్ష-2025 నోటిఫికేషన్ విడుదల

Must Read

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు https://upsconline.gov.in/upsc/OTRP/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -