Saturday, December 28, 2024

కేటీఆర్ పై కేసు నమోదుకు కారణమిదే!

Must Read

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ను ఏ1గా చేర్చింది. ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. విదేశీ సంస్థకు అక్రమంగా రూ.54.88 కోట్లు చెల్లించినట్లు అభియోగాలు మోపింది. స్పాన్సర్ షిప్ సంస్థలు చెల్లించాల్సిన మొత్తం.. ఆయా సంస్థలు చెల్లించకుండా చేతులెత్తేయడంతో ప్రభుత్వమే చెల్లించింది. అయితే, దీనికి మంత్రి మండలి ఆమోదం లేకపోవడం, ఏక పక్ష నిర్ణయాలు ఈ కేసుకు కారణమయ్యాయి. ఇది ప్రభుత్వ ఖజానాకు నష్టమని ఏసీబీ పేర్కొంది. ఇదంతా మోసపూరిత ఒప్పందమని తెలిపింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ), రెడ్ విత్ 13(2), సెక్షన్ 409 రెడ్ విత్ 120 బి కింద కేసులు నమోదు చేసింది. ఇది నిరూపణ అయితే నిందితులకు యావజ్జీవ శిక్షపడే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డే పెద్ద దొంగ: కేటీఆర్

హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా గత ప్రభుత్వం పనిచేసిందని, ఫార్ములా ఈ రేసులో అసలు అవినీతే జరగలేదని కేటీఆర్ అన్నారు. ఇదంతా చట్టబద్ధంగానే జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ను అప్రతిష్ట పాలు చేస్తోందన్నారు. అక్రమ కేసులు పెట్టి, తన వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గుట్టుచప్పుడు కాకుండా ఫార్ములా ఈ రేసు వ్యవస్థాపకుడును కలిశాడని అతని ఫొటోను షేర్ చేశారు. రేవంత్ రెడ్డే పెద్ద దొంగ అని ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

మన్మోహన్ కు కన్నీటి నివాళి

మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏండ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. నేడు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -