ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి న్యాయస్థానంలో ఊరట దక్కింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులు ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్ అంతా గాలించారు. కానీ, ఆర్జీవీ మాత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ చేసిన ధర్మాసనం ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది.