Saturday, August 30, 2025

జగన్ ఒక అవివేకి, అజ్ఞాని.. షర్మిల ఫైర్!

Must Read

జగన్ తీరు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. స్వయం కృతాపరాధం వల్ల ప్రతిపక్ష హోదాకు దూరమైతే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామనడం జగన్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీ మీద అలగడానికి కాదని, సొంత మైకుల్లో మాట్లాడడం కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయమని, ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలనే ఇంగితం లేకపోవడం బాధాకరమన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -