Friday, November 22, 2024

పోలవరంపై లాలూచీ ఎందుకు చంద్రబాబు?

Must Read

పోలవరం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కూటమి ప్రభుత్వం తగ్గించడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. దేనికి లూలూచీ పడి ఈ పనికి ఒడిగట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. చంద్రబాబు స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎత్తు తగ్గించడం కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుందన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేమన్నారు. అన్నికంటే సుజలస్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఆది నుంచి చంద్రబాబు స్వప్రయోజనాలే చూసుకున్నారని పేర్కొన్ఆనరు. బంధువులకు, పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తన చేతిలోకి తీసుకున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఇదే అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం వల్ల ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. దాని వల్ల రైతులకు ప్రయోజనం ఉండదన్నారు. ఉత్తరాంధ్రకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక...
- Advertisement -

More Articles Like This

- Advertisement -