Thursday, January 2, 2025

అమరావతి పనులు పున:ప్రారంభం

Must Read

రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని, అమరావతి రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామన్నారు. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించిన ఘనత తనదేనన్నారు. ముందుచూపుతోనే సైబరాబాద్ లో ఎనిమిది వరుసల రోడ్లు వేశామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకంటూ ఆనాడు అందరూ ప్రశ్నించారని.. అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతీచోటా ఉంటారని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు మొత్తం 54 వేల ఎకరాలు ఇచ్చారని, జగన్ హయాంలో రాజధాని కుదేలు చెందిందన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా రైతులు గట్టిగా పోరాడారని కొనియాడారు. అమరావతి ఉద్యమానికి తమ పార్టీ ఆర్థికంగా అండగా నిలబడిందన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు రూ.225కోట్లు విడుదల చేస్తామన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీగా ఉంటుందన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల విలువలు పెరిగాయన్నారు. ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అమరావతికి త్వరలోనే విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వర్సిటీలు వస్తున్నాయన్నారు. బుల్లెట్ రైలు ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరామన్నారు. ఈ రైలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా వెళ్తుందని చెప్పానన్నారు. అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అనుకున్న సమయంలోగా పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్‌గా జరగాలని, గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ప్రాంతంలో 183 కిలోమీటర్లతో ఓఆర్ఆర్ వస్తుందని, రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మరో రెండు వారాల్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం అవుతాయని.. రాష్ట్రంలో వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -