Wednesday, July 2, 2025

నాగర్ కర్నూల్ లో ఎస్సై దాష్టీకం

Must Read

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నాల్ జిల్లాలో ఓ ఎస్సై తన ముందు తల దువ్వుకున్న యువకులకు శిరోముండనం చేయించాడు. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలోని ఓ పెట్రోల్ బంక్ లో ముగ్గురు యువకులు.. బంక్ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో ఎస్సై జగన్ రంగప్రవేశం చేశారు. ఈక్రమంలో అతని ముందు ఆ ముగ్గురు యువకులు తల దువ్వుకున్నారు. ఆగ్రహం చెందిన ఎస్సై.. వారిని స్టేషన్ కు తీసుకెళ్లి గుండు గీయించాడు. మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -