Saturday, December 20, 2025

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధమాల్!

Must Read

హైదరాబాద్ లో ఇప్పుడు అందరికీ హైడ్రా భయం పట్టుకుంది. సేల్ డీడ్, హౌజ్ పర్మిషన్, నల్లా కనెక్షన్, టాక్స్ రశీదు ఉన్నప్పటికీ.. హైడ్రా తగ్గడం లేదు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వం స్థలాలను అడుగు ఆక్రమించినా.. కూల్చేస్తున్నారు. లబోదిబోమని మొత్తుకున్నా.. బుల్‌డోజర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో నగరంలో ఇల్లు కొనాలంటేనే సగటు మనిషి ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు మాత్రం ప్రస్తుతం ఇండ్ల జోలికి పోవడం లేదు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రియల్ ఎస్టేట్ 30 శాతం పడిపోయింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ల కింద ప్రభుత్వానికి రూ.955 కోట్లు రాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.650 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు 20వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అయితే, మీరు స్థలం కొనాలంటే ఇప్పుడు పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు సదరు స్థలం బఫర్ జోన్ లో ఉందా? లేదా? అని తెలుసుకోవాలి. ఇందుకోసం https://lakes.hmda.gov.in/ అనే వెబ్ సైట్ ను సందర్శించాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -