ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి మూడు వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 200 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత రెండు రోజుల్లో 2800 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబర్ 09వ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ. అప్లికేషన్ల రూపంలో ప్రభుత్వానికి రూ.60కోట్ల రాబడి వచ్చింది. ఏపీలో మొత్తం 3396 మద్యం షాపులు ఉండగా.. 12 స్మార్ట్ స్టోర్స్ ఉన్నాయి.