Friday, May 9, 2025

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

Must Read

Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

సినిమా: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, శ్రీవిద్య, హరిణి, అభిషేక్ మహర్షి, సౌమ్య వారణాసి తదితరులు
సంగీత దర్శకుడు: కళ్యాణి మాలిక్
ఎడిటర్: కిరణ్ గంటి
సినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ వర్మ
ప్రొడ్యూసర్: విశ్వ ప్రసాద్
డైరెక్షన్: శ్రీనివాస్ అవసరాల
రిలీజ్ డేట్: 17 మార్చి, 2023

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బహుముఖ ప్రముఖుల్లో శ్రీనివాస్ అవసరాల ఒకరు. నటుడిగా, రచయితగానే కాకుండా దర్శకుడిగానూ సటిల్ కామెడీని పండించడం ఆయన ట్రేడ్ మార్క్. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ తర్వాత డైరెక్టర్గా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’తో ముందుకొచ్చారు.

కథ
సంజయ్ పీసపాటి (నాగ శౌర్య), అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) కళాశాల నాటి నుంచి పరిచయస్తులు. అయితే కాలేజీలో ఆమె అతని కన్నా ఏడాది సీనియర్. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ స్నేహం కాస్తా పొసెస్సివ్నెస్గా మారుతుంది. అది ప్రేమ అని తెలియడానికి వారికి చాలా సమయం పడుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే క్లైమాక్స్. అయితే కథ క్లైమాక్స్కు చేరుకునే వరకు రకరకాల సబ్ ప్లాట్స్ తో పాటు గిరిరాజ్ కామర్సు (అవసరాల శ్రీనివాస్) క్యారెక్టర్ కూడా ప్రవేశిస్తుంది.

అవసరాల శ్రీనివాస్ పాత్ర ఎంటర్ అయ్యాక హీరోయిన్ కి హీరో మీద పొసెస్సివ్నెస్ క్రియేట్ చేయాడానికి అన్నట్లుగా పెట్టిన పూజ (మేఘా చౌదరి) పాత్ర, హీరోకి హీరోయిన్ మీద పొసెస్సివ్నెస్ పెంచడానికి పెట్టిన సునీల్ (కిట్టు విస్సాప్రగడ) పాత్రలు కూడా ఎంటర్ అవుతాయి.

సినిమా నిడివి 2 గంటల 6 నిమిషాలే అయినప్పటికీ పెద్ద చిత్రంలా అనిపిస్తుంది. దానికి కారణం కథనంలో ఒక ఆర్గానిక్ ఫ్లో అనేది లేకపోవడమే. స్క్రీన్ ప్లేలో కొంత గందరగోళం. ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకు వెళ్లడం వల్ల స్టోరీని ఏ ఎమోషన్ తో కనెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్ధం కాదు. పైపెచ్చు ఆ హీరో కేరక్టరైజేషన్ కూడా కాస్త తికమకగా ఉంటుంది.

ఎలా ఉందంటే..!
ఒకానొక సందర్భం నుంచి అనుపమకి హీరో దూరమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అలా దూరమవుతున్నాడో తెర మీద క్యారెక్టర్లతో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కూడా తెలియదు. కానీ దానికి చివర్లో చెప్పిన కారణం బరువు అస్సలు సరిపోలేదనే చెప్పాలి. హీరో పాత్రకి ఆ విషయం పెద్దదిగా అనిపించొచ్చు కానీ చూసే ఆడియెన్స్కు మాత్రం అనిపించదు. అనిపించేలా స్క్రీన్ ప్లే లేకపోవడమే ఇక్కడ మైనస్ పాయింట్. అదే ఈ మూవీని బిలో యావరేజ్ గా నిలబెట్టేస్తుంది.

అవసరాల శ్రీనివాస్ కామెడీ ఇంచుకైనా లేకుండా నీరసంగా సాగే ఈ చిత్రం మధ్యమధ్యలో ‘చాప్టర్-1’, ‘చాప్టర్2’ అంటూ చూపించిన ప్రతిసారీ ఆడియెన్స్ నిట్టూర్పులు వినిపించాయి. ‘ఇంకా ఎన్ని చాప్టర్లు ఉన్నాయి రా బాబూ’ అంటూ నిట్టూర్చాడొక ప్రేక్షకుడు. ఫస్ట్ హాఫ్ అంతా సుదీర్ఘమైన షార్ట్ ఫిల్మ్ లా సాగుతుంది. ర్యాగింగ్ సీన్స్ అయితే చాలా విసిగిస్తాయి.

టెక్నికల్ గా చూస్తే కళ్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా సాగింది. ట్యూన్స్ రెట్రో స్టైల్లో చాలా బాగున్నాయి. ‘కఫిఫి’ సాంగ్ టేకాఫ్ ప్రామిసింగ్ గా అనిపించినా తర్వాత మాత్రం యావరేజీగా అనిపిస్తుంది. ‘నీతో’ పాట మాత్రం ట్యూన్, లిరికల్ పరంగా బాగుందని చెప్పొచ్చు. కెమెరా, ఎడిటింగ్ లాంటి ఇతర సాంకేతిక విభాగాలు ఓకే అనిపించాయి.

రొటిన్గా అనిపించిన నాగశౌర్య
నాగశౌర్యకి చాలా ఎమోషన్స్ పండించగలిగే స్కోప్ దొరికింది. కానీ ఎందుకో ఆయన రొటీన్ గా అనిపించాడు. బహుశా డైరెక్టర్ అంత అవసరం ఫీలవలేదేమోనని అనిపిస్తుంది. మాళవిక నాయర్ మాత్రం ఆకట్టుకుంటుంది. సెకండ్ హీరోయిన్ మేఘా బబ్లీగా, ఎట్రాక్టివ్గా, యాక్టివ్ గా ఉంది. ఉన్నంతలో మేఘ నటన అలరిస్తుంది. శ్రీనివాస్ అవసరాలది గెస్ట్‌ రోల్ కాదు. అంతకంటే పెద్దదైన పాత్రలో ఆయన కనిపించారు. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు. ఎక్కువగా లండన్ కు చెందిన తెలుగు నటీనటుల్ని వాడుకున్నారు.

వారికి మాత్రమే నచ్చుద్దేమో!
ఏదేమైనా ఇది శ్రీనివాస్ అవసరాల జారవిడుచుకున్న చాన్స్లా ఉంది. స్క్రీన్ ప్లేలో ఉన్న కన్ఫ్యూజన్ స్క్రిప్ట్ స్టేజిలోనే గమనించకపోవడం పొరపాటనే చెప్పుకోవాలి. ఏ రకమైన ఎమోషన్ కు గురిచేయని పేలవమైన కథా, కథనాలతో సాగింది ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’. పైన చెప్పుకున్నట్టు ఫలానా 40 వయసు పైబడిన ఆడయెన్స్ ఓపిక, తీరిక ఉంటే చూడొచ్చేమో!

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

క‌శ్మీర్‌లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల్లో క‌శ్మీర్‌లో పాక్ కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -