చంద్రబాబు దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలిసిందని ఒక దుష్ప్రచారం చేయించి రాక్షసానందం పొందారని విమర్శించారు. 100 రోజుల పాలన విఫలం అవ్వడంతోనే ఈ లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కంటైనర్లు వచ్చాయని, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అంశాన్ని వైసీపీ మీద రుద్దడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఒక మాజీ సీఎంకు తిరుమలను దర్శించుకునే అవకాశం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఘటన జరగలేదన్నారు. వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయించి తనను అడ్డుకోవాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్టులో వాస్తవికత లేదని, సదరు సంస్థే డిక్లరేషన్ ఇచ్చిందన్నారు.