Tuesday, July 15, 2025

బాంబులతో పేల్చేసిన హైడ్రా

Must Read

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. ఓఆర్ఆర్ పరిధి దాటి దూసుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ఏకంగా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అక్కడికి వెళ్లేందుకు చెరువు మీదుగా మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు. దీనిని ఒక అతిథి గృహంగా మార్చాడు. రాత్రి వేళల వచ్చి ఇక్కడే పార్టీలు చేసుకునేవాడు. ఏకంగా చెరువులోనే నిర్మాణం ఉండడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆ బిల్డింగుకు బాంబులు అమర్చి పేల్చేశారు. రెండు సెకన్లలోనే భవనం కుప్పకూలింది.

హైడ్రాకు అడ్డగింతలు..

మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తున్నారు. నదీ సమీపంలోని భవనాలకు మార్కింగ్ వేస్తున్నారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, పలుచోట్ల హైడ్రా అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. సర్వే చేయకుండా నిలువరించారు. తమ ఇండ్లు కూల్చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -