విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళుతుండగా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిసి ప్లాంట్‌ను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. కాకానినగర్ వద్ద నిరీక్షించిన...