కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు స్థానాల కోసం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, సాయంత్రం 5 గంటల వరకు...
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన జక్కు లక్ష్మీనరసమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లయి చాలాకాలమైంది. భర్త మృతి చెందడంతో ఆమె తన ఇల్లు వదిలి వేరే చోట నివసిస్తోంది. కొడుకు శివాజీకి కూడా...
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. హాజరు శాతం 92.90గా నమోదైంది. పరీక్షలను ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల మార్పు చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుల వెనుక ఉద్దేశ్యంపై వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, “పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలను మార్చారా?” అని ప్రశ్నించారు. నల్గొండవారిపల్లె గ్రామ ఓటర్లు ఇప్పుడు తమ ఓటు...
మంచిర్యాల జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కొందరు వ్యక్తులు అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు కవాల్ టైగర్ రిజర్వ్‌లోని ఇందన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలోని...
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని ఆయన మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఏలేటి, “రేవంత్ రెడ్డి నువ్వు ఒక బచ్చా… ప్రధాని నరేంద్ర మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా...
రాఖీ పండగ వాతావరణంతో రాష్ట్ర రాజధాని సందడిగా మారింది. సోదరులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వెళ్లే అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో నగరంలోని ముఖ్య బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్ వంటి కేంద్రాల్లో ఉదయం నుంచి రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని...
గిరిజన ప్రాంతాల్లో వంద శాతం శాశ్వత పాఠశాల భవనాల నిర్మాణం మా సంకల్పమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమైన అడుగుగా, మారుమూల ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.45.02 కోట్లు మంజూరు చేస్తూ జీ.ఓ నంబర్...
తమిళనాడు ప్రభుత్వం విద్యా రంగంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంని రాష్ట్రంలో రద్దు చేస్తున్నట్టు సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. దీని స్థానంలో తమిళనాడుకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. సీఎం స్టాలిన్ ప్రకటన ప్రకారం, కొత్త రాష్ట్ర విద్యా విధానంలో ద్విభాషా విధానాన్ని కొనసాగించనున్నారు. అంటే,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హోంశాఖ సహాయమంత్రి అయినప్పటికీ బండి సంజయ్‌కు ఇంటెలిజెన్స్ ఎలా పని చేస్తుందో అర్థం లేదని, కనీస సాధారణ జ్ఞానం కూడా లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో బండి సంజయ్ హద్దులు దాటారని, చౌకబారు ఆరోపణలు చేసి, తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఆయన...