టీడీపీ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా విజృంభిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, "వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవు. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నకిలీ మద్యం విజృంభిస్తోంది....
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ ఈ వివాదాన్ని సృష్టించిందని మంత్రి నారాయణ తోసిపుచ్చారు. విశాఖ పర్యటనలో వర్మ మంత్రి నారాయణను కలిసి వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టెలీకాన్ఫరెన్స్ మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడని...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహిళలను అవమానించడం అలవాటుగా పెట్టుకుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మీపై టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన మహిళా నాయకురాలిపై వీడియోలు తీయించారని,...
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు స్థానాల కోసం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, సాయంత్రం 5 గంటల వరకు...
కడప జిల్లా పులివెందుల మండలంలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు కేసుల వరకు వెళ్లాయి. ఇటీవల నల్లగొండ వారి పల్లెలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకుడు వేముల రాము ఇచ్చిన ఫిర్యాదులో, ఎమ్మెల్సీ...
కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చెలరేగింది. స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డిపై కొందరు టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన ప్రాంతంలో కలకలం రేపింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో, ప్రస్తుతం పులివెందులలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ...
చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను టీడీపీ కార్యకర్త తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమెభర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన...