కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,...
స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో...
రాష్ట్రంలో విద్యుత్ విభాగాన్ని ప్రక్షాళన చేయడానికి అవసరమైన కీలక సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇంధన శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్...
జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు కచ్చితంగా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారుల సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కాల్‌సెంటర్...
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరాలని మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్...
తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగానికి ఆచార్య సి.నారాయణ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. తెలుగు...
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్, జటప్రోలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి , ప్రస్తుత పాలన లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజా సభలో వివరించారు. “తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుగా రావొద్దు. సహకరించండి. వినకపోతే పోరాడతాం. ఆ పోరాటానికి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు నుంచి ఊరట లభించింది. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఈ తీర్పు వెలువడింది. 2016లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిపై గోపన్నపల్లిలోని 31...
ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజయ్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కానుకగా పలు...