కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,...
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలన్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే వాదనలు నూటికి నూరుపాళ్లూ అవాస్తవం,” అని కవిత స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగినప్పటికీ, అక్కడి నుంచి ఇప్పటివరకు 5,657 టీఎంసీల...
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా...