Monday, January 26, 2026

#india

భారత్‌పై సుంకాలు విధించ‌డం త‌ప్పు – రిపబ్లికన్‌ నేత విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో దేశాలపై విధిస్తున్న సుంకాల‌పై విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన రిచ్ మెక్‌కార్మిక్ ట్రంప్ పాలసీలపై చర్చలో భారతదేశంతో త‌ప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. “భారత్ అమెరికాకు పెట్టుబడులు తీసుకు వస్తుంది....

దేశ 53వ సీజేఐగా జస్టిస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా తర్వాత జస్టిస్ సూర్య కాంత్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు (సుమారు 15 నెలలు) జస్టిస్...

జమ్మూక‌శ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, జమ్మూకాశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేశారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ చర్చలో ఆయన పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, వనరుల దోపిడీని...

పాక్-అఫ్గాన్ సరిహద్దు ఉద్రిక్తతలు: భారత్‌పై పాక్ మంత్రి ఆరోపణలు

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అఫ్గాన్ భారత్ తరఫున పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇది ఎక్కువ కాలం...

భారతీయుల వ‌ల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం – అమెరికాలో ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయంతో పాటు భారత్, రష్యా సన్నిహితత, చైనాతో మెరుగవుతున్న సంబంధాలు అమెరికా రాజకీయవర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ట్రంప్ మద్దతుదారులైన రైట్ వింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయ ఉద్యోగులు,...

దేశవ్యాప్తంగా 476 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

రాజకీయ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించిన పార్టీలపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మరో 476 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 9 పార్టీల గుర్తింపులు రద్దు...

లైంగిక సమ్మతికి 18 ఏళ్లు నిండాల్సిందే

దేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీస వయసు 18 ఏళ్లుగానే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వయోపరిమితి తగ్గింపుపై చేసిన వాదనకు ప్రతిస్పందిస్తూ, అదనపు...

చైనా ప‌ర్య‌ట‌న‌కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాకు వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అక్కడ టియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టే ఇది తొలి పర్యటన కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది....

ర‌ష్యాకు అజిత్‌ దోవల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై భారీ సుంకాలను విధిస్తానన్న హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో భారత్‌–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ట్రంప్‌ బెదిరింపులకు వెనుకాడని భారత్‌, రష్యాతో సంబంధాలను గట్టిపరచే దిశగా కీలక అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ...

భార‌త్‌తో బంధాన్ని దెబ్బ‌తీయొద్దు – నిక్కీ హేలీ

భారత్‌తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్‌ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...
- Advertisement -spot_img

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -spot_img