Monday, October 20, 2025

#delhi

ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ యమున న‌ది

దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్‌లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత...

బీసీ బిల్లుల‌కు వెంట‌నే ఆమోదం తెల‌పండి – సీఎం రేవంత్ రెడ్డి

స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా...

నేడు ఈడీ ముందుకు అనిల్‌ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై ఆర్థిక నేరాల విభాగం (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అంబానీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆగస్టు 1న ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం...

ఎర్రకోటలో భద్రతా లోపం

దేశ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు కొద్ది రోజుల ముందే ఎర్రకోట భద్రతలో పెద్ద ఎత్తున లోపం బయటపడింది. ఢిల్లీ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక భద్రతా డ్రిల్‌లో విధుల్లో ఉన్న అధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.స్వాతంత్య్ర‌ వేడుకల్లో ప్రధాని ప్రసంగించే వేదిక కావడంతో ఎర్రకోటలో భద్రతా చర్యలు అత్యంత కట్టుదిట్టంగా ఉండాలి....

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశ‌ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు క‌ల‌క‌లం రేపాయి. నేడు ఉద‌యం నుంచి సుమారు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని సమగ్ర తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు నేపథ్యంలో పాఠశాలల సిబ్బంది, విద్యార్థులను...

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల‌ సీఎం‌ల భేటీ

ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఆయన ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీలో చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హోంమంత్రి అమిత్ షాతో ఆయన మొదటి సమావేశం జరగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం...

ఢిల్లీలో భూకంపం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భూకంపం క‌ల‌క‌లం రేపింది. గురువారం భూమి స్వ‌ల్పంగా కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

మొక్క నాటిన న‌రేంద్ర మోదీ

నేడు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ పేరుతో ఒక మొక్క‌ చొరవను ప్రత్యేక చెట్ల పెంపకం డ్రైవ్‌తో బలోపేతం చేశామ‌న్నారు....

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సెల‌వులు ర‌ద్దు

పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగుల‌కు సెల‌వులు ర‌ద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్య కార‌ణాలు మిన‌హా ఏ ఒక్క‌రికి సెల‌వులు మంజూరు చేయ‌కూడద‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే సెల‌వుల్లో ఉన్న‌వారి సెల‌వుల‌ను...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img