దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న అటల్ పెన్షన్ యోజనను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది....