ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు.
స్త్రీ శక్తి – ఉచిత బస్సు...
అడవి ఏనుగుల నుంచి పంటలను రక్షంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక నుంచి ఏపీకి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలులో భాగంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది...
ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2022 అక్టోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలు న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైనప్పటికీ, నేడు ఫలితాలు వెలువడ్డాయి. 2022 జనవరి...
వైసీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పర్యటన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు నా గుండెల్లో ఉన్న ప్రదేశం అని, మీ ప్రేమే నాకు శక్తి అంటూ ప్రజలతో వ్యాఖ్యానించారు. ప్రజల కోసం తాను...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ హెలికాప్టర్...
నెల్లూరులో నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ రోజు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ చేయనున్నారు. అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలిపివేస్తూ ట్రైబ్యునల్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైయస్ షర్మిలపై ఆరోపణలు చేస్తూ, షేర్లను తమ అనుమతి...
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. అనంతరం ఆగస్టు 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇక మరోవైపు, తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికులను కలచివేస్తోంది. సమాచారం ప్రకారం, నాలుగు నెలల క్రితం ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...