సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ముఫరహత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన బృందంలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున 1:30 గంటలకు మదీనా నుంచి 160 కి.మీ. దూరంలోని ముహ్రాస్ వద్ద...
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే జనగామ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులను దిండిగల్‌కు చెందిన...
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. విజయవాడ, కుందేరు గ్రామాలకు చెందిన యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడి సర్వీస్ రోడ్‌పై పడింది. ముగ్గురు స్థానికంగానే మరణించగా, మరొకరు గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లబడి చికిత్సలో మృతి చెందాడు. అతివేగమే...
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తీవ్ర రోడ్డు దుర్ఘటన సంభవించింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద నేషనల్ హైవేపై పెళ్లి కారు అదుపుతప్పి భీకర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రయాణికులపై కారు దూసుకెళ్లింది. అన్నవరం నుంచి పెళ్లి కార్యక్రమం...
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డుపై ఒడిశా ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్‌కు వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయాందోళనకు...
కర్నూలు జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...
మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదుపుతప్పిన ప్రయాణికుల వ్యాన్ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో...