Thursday, November 21, 2024

103 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పీటీ ఉషా

Must Read

PT Usha 103 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పీటీ ఉషా, పీటీ ఉష పూర్తి పేరు పిలవుళ్ల కండి టెక్క పరాంబిల్. కేరళ కాళీ కట్ సమీపంలోని పయోలీ గ్రామంలో 1964 జూన్ 27న పీటీ ఉష జన్మించారు. పయోలీ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నందుకు పీటీ ఉషను పయోలీ ఎక్స్ ప్రెస్ అని పిలుస్తారు. 4వ తరగతి నుంచే రన్నింగ్ పై ఆసక్తి ఉన్న పీటీ ఉష 1979వ సంవత్సరంలో జాతీయ పాఠశాలల క్రీడల్లో పాల్గొన్నారు. కోచ్ మాధవన్ నంబియార్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. పీటీ ఉషకు 13 ఏళ్ల వయస్సులో కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రీడా పోటీల్లో తన బంధువుల సాయంతో పరుగుల రాణీగా మారారు. ఆటల్లో శిక్షణతో పాటు స్కూల్ లో తరగతులకు కూడా హాజరయ్యేవారు. కోచ్ ఓం నంబియార్ సాయంతో పీటీ ఉష అంతర్జాతీయ క్రిడలలో గెలిచేందుకు సహాయపడ్డారు. 16 ఏండ్ల వయస్సులో 1980వ సంవత్సరం మాస్కోలో జరిగిన వేసవి ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత 4 ఏండ్లు సుధీర్ఘంగా కష్టపడి భారత దేశం నుంచి ఎంపికైన తొలి మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు. ఒక్క సెకండ్ తో చైజారిన ఆ పతకం మళ్లీ 1984వ సంవత్సరంలో లాస్ ఏంజెల్స్ లో నాల్గొవ స్థానంలో నిలిచినా ప్రపంచం దృష్టిని తనవైపు చూసేలా చేసింది. 1986 వ సంవత్సరంలో సౌత్ కొరియా, సియోల్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. ఇలా వరుస పథకాలు సాధించి ఏకంగా 103 అంతర్జాతీయ అవార్డుల గ్రహితగా చరిత్ర సృష్టించారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

బొంకుల బాబు మళ్లీ అవే మోసాలు!

– మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం బొంకుల చంద్రబాబు మళ్లీ అవే మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -