చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు!
భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఈ క్రమంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను వెనక్కినెట్టాడు. అహ్మదాబాద్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన అక్షర్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైల్స్టోన్కు చేరుకునేందుకు అక్షర్కు 2,205 బంతులు పట్టాయి. అతడి తర్వాత వరుసలో బుమ్రా (2,465 బాల్స్లో), కర్సన్ ఘావ్రి (2,534 బాల్స్లో), అశ్విన్ (2,597 బాల్స్లో) ఉన్నారు