Tuesday, April 15, 2025

ద‌టీజ్ జ‌గ‌న్‌
ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు

Must Read

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ విజ‌య‌వంతం

రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రానికి పోటెత్తింది.

రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు పెద్ద ఎత్తున్న ఇన్వెస్టర్లు త‌ర‌లివ‌చ్చారు. సదస్సులో భారీపెట్టుబడులకు ఆసక్తిక కనబరిచారు. ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా.. రాష్ట్రం దిశనే మార్చేసింది ఈ సదస్సు. విశాఖ తీరాన విప్లవాత్మకమైన నిర్ణయాలకు జీఐఎస్‌ ప్రాంగణం నెలవైంది. ఎనర్జీ విభాగంలో ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ సదస్సులో భాగంగా వివిధ రంగాలపై 15 సెషన్లు నిర్వహించాం.100 మందికిపైగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను కున్న బలాలేంటో చెప్పారు. ఆటోమైబైల్‌– ఈవీ సెక్టార్, హెల్తకేర్‌– మెడికల్‌ ఎక్విప్‌మెంట్, రెన్యువబుల్‌ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా, అగ్రి ప్రాససింగ్‌ మరియూ టూరిజం తదితర రంగాలు ఉన్నాయి.

సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుంది. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి ( ఒన్‌ డిస్ట్రిక్ట్‌ – ఒన్‌ ప్రొడక్ట్‌) థీమ్‌ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా ఈరెండు రోజులపాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపారు.

ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి.

ఐటీ మరియు ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం రంగంలో 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్‌ ల్యాబ్, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్‌ మరియు అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసిందంటూ త‌న ముగింపు ప్ర‌సంగంలో వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -