క్రీడా లోకంలో సంచలనం
ఈ మధ్య స్వలింగ వివాహాలు కామన్ అయ్యాయి. కానీ ఓ క్రికెటర్ స్వలింగ వివాహం చేసుకుంటే అది స్పెషలే. అసలు విషయానికి వెళ్తే.. స్వలింగ వివాహాలు చాలా దేశాల్లో చట్టబద్ధం అయ్యాయి. మన దేశంలోనూ ఈ వివాహం చట్టబద్ధమైందే. ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు మహిళలు వివాహం చేసుకుంటే దానిని స్వలింగ వివాహం అంటారు. అయితే ఇంగ్లడ్ దేశానికి చెందిన ప్రముఖ మహిళా క్రికెటర్ డ్యానిల్లే వ్యాట్ మరో క్రీడాకారాణిని వివాహం చేసుకుంది. ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఫుట్ బాల్ క్రీడాకారాణి జార్జీని మనువాడింది.
ప్రేమ చిగురించిందిలా..
క్రికెటర్ డ్యానిల్లే వ్యాట్, ఫుట్ బాలర్ జార్జీ చిన్ననాటి స్నేహితులు. ఎప్పటి నుంచో ఇరువురు కలిసిమెలసి ఉంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్తుండేవారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో అది ప్రేమ వరకూ వెళ్లింది. బహిరంగంగానే ముద్దులు, హగ్గులతో హల్ చల్ చేసేవారు. తాజాగా ఇరువురు ఒక్కటయ్యారు. అధికారికంగా పెండ్లి చేసుకుని, క్రీడా రంగంలో ఆసక్తిని నింపారు. సామాన్యులతో పాటు క్రీడాకారులు సైతం స్వలింగ వివాహాలు చేసుకోవడం గమనార్హం. వీరిద్దరు ఒక్కటి కావడంతో క్రీడా అభిమానులంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే క్రికెటర్ డ్యానిల్లే వ్యాట్ విమెన్ ప్రీమియర్ లీగ్ -2023 లో ఏ జట్టుకూ అమ్ముడుపోలేదు. వేలంలో ఆమెను ఎవరూ తీసుకోలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా గతంలో ఆమె అసహనం వ్యక్తం చేసింది.