Thursday, November 21, 2024

బాబు అవినీతి ఆరు లక్షల కోట్లు!

Must Read

– వెలుగులోకి విస్తుపోయే నిజాలు
– ఆధారాలతో సహా బయటకు..
– ఏపీలో సంచలనం రేపుతున్న మ్యాగజైన్
– ఇది రాసింది ప్రముఖ జర్నలిస్ట్ శ్వేత నాయుడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలన్నీ చంద్రబాబు అవినీతి, అక్రమాలపై దృష్టిసారించాయి. దాదాపు 14 ఏండ్లు పరిపాలించిన చంద్రబాబు ఏ రోజూ.. జైలుకు వెళ్లలేదు. 40 ఏండ్ల రాజకీయ ప్రస్థానంతో తొలిసారిగా జైలుపాలు కావడంతో చంద్రబాబు చేసిన తప్పిదాలను వెతికే పనిలో పడ్డారు. సీఐడీ బయటపెట్టిన స్కిల్ స్కాం.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుండగా.. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి కార్యకలాపాలు సైతం బయటపడుతున్నాయి. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు శ్వేత నాయుడు విడుదల చేసిన మ్యాగజైన్ ఏపీలో కలకలం రేపుతోంది. బాబు చేసిన రూ.6లక్షల కోట్ల అవినీతి లెక్కలను సాక్షాధారాలతో ఆమె బయటపెట్టింది. ఇంతకీ అందులో ఏం ఉందంటే..

స్కిల్ స్కాం రూ.371కోట్లు

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు ‘సీమెన్స్, డిజైన్ టెక్’ కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 10శాతం అనగా రూ.371కోట్లు ప్రభుత్వ వాటాగా.. మిగిలినది కార్పొరేట్ ఫండ్ కింద ఆయా కంపెనీలు ఇస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ఆమోదం లేకుండానే రూ.371కోట్లు విడుదల చేశారు. కానీ ఈ నిధులు డిజైన్ టెక్ కింద షెల్ కంపెనీలకు వెళ్లాయి. సీమెన్స్ తో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆ కంపెనీ తెలిపింది. ఇలా రూ.371కోట్లను చంద్రబాబు నాయుడు దారి మళ్లించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని చంద్రబాబు నాయుడు రూ.16,000 కోట్ల నుంచి రూ.57,940.86 కోట్లకు పెంచారు. మూడు రెట్లకు పైగా ప్రాజెక్టు వ్యయం పెంచి, రూ.25,000 కోట్లు దోచేశారు. అయినా ప్రాజెక్టు పునాదులు దాటలేదు.

బినామీతో రూ.4,834 కోట్ల అవినీతి

చంద్రబాబు నాయుడి బినామీ అనగానే గుర్తుకొచ్చేది సీఎం రమేశ్ పేరే. ఆయన పేరుతో జలవనరుల శాఖలోనే రూ.4,834 కోట్ల అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు. ప్రాజెక్టులన్నీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కు కట్టబెట్టాడు. అడుగడుగునా నిబంధనలు ఉల్లంగించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చారు. గోదావరి–పెన్నా నదుల అనుసంధానంలో రూ.3వేల కోట్లు చంద్రబాబు బుక్కేశారు. వ్యాప్కోస్ నివేదికను పూర్తిగా మార్చేసి, రూ.6,020కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో కాంట్రాక్టర్ల ద్వారా సగం నిధుల్ని దోచేశారు. ఇదిలా ఉండగా, అయినవాళ్ల కోసం అడ్డగోలుగా జీవోలు మార్చారు చంద్రబాబు నాయుడు. జీవో 22, జీవో 63 ద్వారా ప్రాజెక్టులకు అవసరం లేకున్నా అదనపు నిధులు కేటాయించారు. ఆయా పనుల్ని కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, రూ.2వేల కోట్లు చంద్రబాబు దోచేశారు. మరోవపు పోలవరం మట్టికట్ట పనుల్లో రూ.1590 కోట్లు మింగేశారు చంద్రబాబు నాయుడు. బాబు అనుచరుడు దేవినేని ఉమతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. పోలవరంలో రాతి, మట్టికట్ట పనులు దక్కించుకుని అంచనా విలువ పెంచేసి, ఈ తతంగం నడిపించారు.

ఉత్తర్వులకు పాతర @930.5కోట్లు

పురుషోత్తపట్నం, కొండవీటి వాగు టెండర్లలో చంద్రబాబు నాయుడు అతి తెలివి ప్రదర్శించారు. ఉత్తర్వుల్లో ప్రాజెక్టుల పేర్లు లేకుండా 50శాతం నిధుల్ని దోచేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.1648 కోట్లు, కొండవీటి వాగుకు రూ.213కోట్లు కేటాయించి, అందులో దాదాపు 50శాతం అనగా రూ.930.5కోట్లు దోచేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 3,4 ప్యాకేజీ పనుల్లో వ్యయం అమాంతం పెంచారు. అదనంగా రూ.223.02కోట్లు దోచుకున్నారు. విస్తరణ పనుల్లో మరో రూ.350కోట్లు కాజేశారు. ప్రాజెక్టుల వ్యయం పెంచి, దోచుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఉరవకొండ సామాజిక ఎత్తిపోతల సూక్ష్మ నీటి పారుదల పథకం కింద చంద్రబాబు నాయుడు రూ.400 కోట్లు కొట్టేశారు. కాంట్రాక్టర్ కు 4.57శాతం అదనపు ధరలతో టెండర్లు కట్టబెట్టి ఈ అవినీతికి పాల్పడ్డారు. ఇదంతా ముఖ్యమంత్రి మరియు సదరు సంస్థ ముందస్తు అవగాహన ద్వారానే జరిగింది.

విశాఖలో కబ్జాలపర్వం

రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దీంతో చంద్రబాబు అండ్ కో.. విశాఖపై వాలిపోయింది. లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారు. అధికారం అడ్డంపెట్టుకొని రికార్డులు మార్చేశారు. ఆయా భూములను బ్యాంకుల్లోనూ తాకట్టుపెట్టారు. ఇది చాలదు అన్నట్లు సిగ్గు లేకుండా ఆయా భూములు హుద్ హుద్ తుఫానులో కొట్టుకుపోయాయని చెప్పారు. సౌభాగ్యపురంలో 120 ఎకరాలు, దర్బంధలో 114 ఎకరాలు, నేరెళ్లవలసలో 114 ఎకరాలు, గండిగుండంలో 69 ఎకరాలు కబ్జా చేశారు. భీమిలిలో 4500 ఎకరాలు, పెందుర్తిలో 3500 ఎకరాలు, అనకాపల్లిలో 6500 ఎకరాలు, యలమంచిలిలో 4000 ఎకరాలు విశాఖ సిటీలో 300 ఎకరాలు కబ్జా చేశారు. వీటి విలువ దాదాపు లక్షన్నర కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు, అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో అందిన కాడికి కబ్జాలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దోచేసిన భూములు అక్షరాలా 62,736 ఎకరాలు. వీటి విలువ దాదాపు 58,933 కోట్లు ఉంటుంది.

ఈనాం భూములపై కన్ను

చంద్రబాబు నాయుడి పరిపాలనలో ఈనాం భూములు కూడా కబ్జాకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24,614 ఎకరాల ఈనాం భూములను టీడీపీ నేతలు అన్యాక్రాంతం చేశారు. వీటి విలువ దాదాపు రూ.5907 కోట్లు ఉంటుంది. నవ్యాంధ్రకు అమరావతిని రాజధానిగా చేస్తానని చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పేదల భూములను బలవంతంగా లాక్కొని, కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు. ఎకరం రూ.4కోట్లు ఉన్న భూమిని, రూ.50లక్షలకే అప్పగించారు. మొత్తం 927 ఎకరాలను కట్టబెట్టి, రూ.3,245 కోట్ల అవినీతికి తెరలేపారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలకు లీకులు ఇచ్చారు. అమరావతిని రాజధానిని చేస్తామని, ఆ ప్రాంతంలో భూములు కొనాలని హింట్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు అస్మదీయులు 25000 ఎకరాల భూములను కారుచౌకకే కొనుగోలు చేశారు. ఇందులో నారా లోకేశ్ అనుచరులు సైతం ఉన్నారు. ఆయా భూముల విలువ దాదాపు లక్ష కోట్లకు పైనే ఉంటుంది.

నీరు–చెట్టులో రూ.34,399 కోట్లు

చంద్రబాబు నాయుడు ఏ పథకం పెట్టినా అది అవినీతే. నీరు–చెట్టులో భాగంగా నాలుగేండ్లలో రూ.12,866కోట్లు ఖర్చు చేయగా.. అందులో పనుల విలువ మాత్రం రూ.3,216 కోట్లుగా ఉంది. కాంట్రాక్టర్లకు దాదాపు
రూ.9649 కోట్లు దోచిపెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవీ కాక మట్టి, ఇసుక ద్వారా మరో రూ.24,750 కోట్లు దోచేశారు. విద్యుత్ శాఖలోనూ రూ.21000కోట్లు బుక్కేశారు చంద్రబాబు. సింహపురి సంస్థ నుంచి 12 ఏండ్ల పాటు విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు సంతకం పెట్టారు. మార్కెట్ లో ఎక్కడా లేని విధంగా రూ.4.80 చొప్పున చెల్లించారు. దీనివల్ల ఏపీ డిస్కం సంస్థలపై రూ.21వేల కోట్ల అదనపు భారం పడింది. ఈ కొనుగోలును డిస్కంలు వ్యతిరేకించినా చంద్రబాబు ఒప్పుకోలేదు. తాత్కాలిక సచివాలయంలో రూ.1,031కోట్లు దోచేశారు. అమరావతిలో కేవలం రూ.120కోట్లతో పూర్తయ్యే తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు ఖర్చు చేసింది రూ.1,151కోట్లు. ఇటీవల సీఎం కేసీఆర్ రూ.800 కోట్లతో అతి పెద్ద సచివాలయం నిర్మించగా.. నరేంద్ర మోడీ ప్రభుత్వం 1200కోట్లతోనే పార్లమెంట్ భవనం నిర్మించింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తాత్కాలిక భవనానికే రూ.1,151కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భవన నిర్మాణానికి రూ.120కోట్లు ఖర్చు కాగా.. చంద్రబాబు రూ.1031కోట్లు దోచేశాడు. అది కూడా చిన్నవానకే కూలిపోయింది.

సోకులకు జనం సొమ్ము

చంద్రబాబు నాలుగేండ్లలోనే 23 విదేశీ పర్యటనలు చేశారు. దీనికి రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. కృష్ణా పుష్కరాల్లో సొంత ప్రచారానికి రూ.23.72కోట్లు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపోరాట దీక్షలు, రాజకీయ సభలకు మరో రూ.2615కోట్లు ఖర్చు చేశారు. అమరావతిలో టవర్ల పేరుతో రూ.2176కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. అమరావతిలో బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.2వేల కోట్లు దోచుకున్నారు. ఆరోగ్యశాఖనూ చంద్రబాబు వదల్లేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖలో రూ.1827కోట్లు దోచుకున్నారు. మెడ్ టెక్ పార్కులో మరో రూ.1723 కోట్లకు ఎసరు పెట్టారు. ఫైబర్ గ్రిండ్ ప్రాజెక్టు ద్వారా రూ.333 కోట్లు కొట్టేశారు. ట్రాన్స్ కో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెండర్లలో రూ.240కోట్ల అవినీతికి పాల్పడ్డారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -