Thursday, November 21, 2024

ఇన్‌స్టాలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై ప్రొఫైల్ ఫొటోను..!

Must Read

సోషల్ మీడియా వినియోగం ఈ రోజుల్లో ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పిల్లలు, యువత, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ సోషల్ మీడియా యాప్స్ కు బాగా అలవాటు పడిపోయారు. పొద్దున లేవగానే వాట్సాప్ లో స్టేటస్ లు చూడటం, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేయడం కామన్ అయిపోయింది. ఫ్రీ టైమ్ లో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూసేయడం, ట్విట్టర్‌ లో అప్టేడ్స్ తెలుసుకోవడం చాలా మందికి ఓ హాబీలా మారిపోయింది. సోషల్ మీడియా యాప్స్ లో ఇన్ స్టాగ్రామ్ వాడకం చాలా ఎక్కువగా ఉంది.

వాడకం ఎక్కువగా ఉంది కాబట్టే యూజర్ల అవసరాలు, అభిరుచులకు తగ్గట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మెటా యాజమాన్యంలోని ఇన్ స్టాగ్రామ్ తాజాగా ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకురానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ టెస్టింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ ఫీచర్ ద్వారా చిన్న చిన్న వీడియోలను కూడా రికార్డ్ చేయొచ్చట. ఇన్ స్టా కొత్త ఫీచర్ కు సంబంధించిన ఒక చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్ తీసుకురానున్న నయా ఫీచర్ ఎలా పని చేస్తుందో ఆడమ్ మోస్సేరి షేర్ చేసిన వీడియోలో చూడొచ్చు. ఇది అందుబాటులోకి వస్తే యూజర్లు తమ డీఫాల్ట్ ప్రొఫైల్ ఫొటోను లూపింగ్ వీడియోతో నోట్స్ లో అప్డేట్ చేసుకోవచ్చట. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు నోట్ ను క్రియేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రొఫైల్ ఫొటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. ఈ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్ లో పోస్ట్ చేయొచ్చట. ఇది వినియోగదారులను తప్పకుండా ఎంతగానో ఆకట్టుకుంటుందని మెటా కంపెనీ భావిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -