Thursday, September 19, 2024

‘పెదకాపు’కు ఊహించని టాక్.. TDPకి గూస్‌బంప్స్ అని చెప్పి ఇలా చేశారేంటి?

Pedakapu Movie Review

Must Read

ప్రస్తుత టాలీవుడ్ డైరెక్టర్స్లో విభిన్నమైన ఇమేజ్ కలిగిన వారిలో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తీయడంలో ఆయన్ను దిట్టగా చెప్పొచ్చు. కుటుంబ నేపథ్య కథల్లో మంచి ఎమోషన్స్ ను జోడించి అందంగా ప్రెజెంట్ చేయడం శ్రీకాంత్ అడ్డాలకు వెన్నతో పెట్టిన విద్య. సాఫ్ట్ మూవీస్ తీస్తూ వచ్చిన ఆయన ఒకేసారి రూటు మార్చి.. విక్టరీ వెంకటేష్ తో ‘నారప్ప’ అంటూ రా అండ్ రియలిస్టిక్ ఫిల్మ్ చేశారు. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు ‘పెదకాపు 1’తో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ ఫిల్మ్ ఇవాళ విడుదలైంది.

బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కృష్ణ ‘పెదకాపు’ సినిమాలో హీరోగా నటించారు. మిక్కీ జే మేయర్ బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. కథ విషయానికొస్తే.. 1980వ దశకం నాటి పొలిటికల్ సిచ్యువేషన్స్ నేపథ్యంలో సాగుతుంది. ఇదే విషయాన్ని మొదట్నుంచి మూవీ టీమ్ హైలైట్ చేస్తూ వచ్చింది. టీజర్, ట్రైలర్స్ లోనూ దీన్నే ఫోకస్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో మంచి హైప్ క్రియేట్ అయింది.

‘పెదకాపు’ మూవీ హైప్ కు తగ్గట్లుగా లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇందులో ఫస్టాఫ్ అస్సలు బాగోలేదని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు గూస్ బంప్స్ వస్తాయని చెప్పి.. మేకర్స్ బిస్కెట్ చేశారని అతడు రాసుకొచ్చాడు. ఈ సినిమా వికృతంగా ఉందని.. ఒక్క సీన్ కూడా కరెక్ట్ గా సెట్ చేయలేదని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు. సినిమా ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేదని.. మూవీలోని కంటెంట్ బిలో యావరేజ్ అని పేర్కొన్నాడు. ఇది సామాన్యుడి సంతకం కాదు.. శ్రీకాంత్ అడ్డాల వారి గునపం అంటూ మరో నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చెప్పాలనుకున్న కథపై క్లారిటీ లేకుండా, జీరో ఎమోషన్స్ తో తెరకెక్కించారని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఇటు ఆడియెన్స్ తో పాటు అటు టీడీపీ సపోర్టర్స్ ను కూడా ఈ సినిమా నిరాశపర్చింది.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -