Thursday, September 19, 2024

OTT Review: రానా నాయుడు వెబ్​ సిరీస్​ ఎలా ఉందంటే..!

Must Read

TT Review: రానా నాయుడు వెబ్​ సిరీస్​ ఎలా ఉందంటే..!

ఇప్పుడు అంతటా వెబ్​సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్​లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు.

విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ నటించిన వెబ్ సిరీస్​ ‘రానా నాయుడు’ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్​ ఎలా ఉందో ఉందంటే..

కథ:

రానా దగ్గుపాటి ఈ సిరీస్ లో రానా నాయుడు గా నటించారు. ముంబైలోని సెలబ్రిటీల సమస్యల్ని పరిష్కరించే వ్యక్తిగా నటించాడు. బాలీవుడ్ స్టార్స్ నుంచి క్రికెటర్ల వరకు ఎవరైనా, ఏ సెలబ్రిటీ అయినా సమస్యలో చిక్కుకుంటే, దాన్ని పరిష్కరించేందుకు వారు రానా నాయుడును కాంటాక్ట్ అవుతారు. రానా నాయుడు తన భార్యా పిల్లలతో విడిగా ఉంటాడు.

అతడి సోదరులైన తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్), పవన్ నాయుడు (అభిషేక్ బెనర్జీ) కూడా ముంబైలోనే ఉంటారు. రానా నాయుడు తండ్రైన నాగా నాయుడు (వెంకటేష్) 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. రానా నాయుడు తన ఫాదర్​ను బాగా ద్వేషిస్తాడు. రానా నాయుడు తన తండ్రిని ఎందుకు ద్వేషిస్తాడు? నాగా నాయుడు రాకతో రానా నాయుడు లైఫ్ ఎలా మారిపోయింది? నాగ నాయుడు జైలుకు వెళ్లడానికి గల కారణాలు ఏంటి? వీటికి జవాబులు దొరకాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Read More : Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

ప్లస్ పాయింట్స్:

ఈ వెబ్​ సిరీస్​లో మెయిన్ హైలైట్​గా వెంకీ-రానాల నటననే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సూపర్బ్​గా ఆకట్టుకుంటాయి. రానా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అంతేగాక భావోద్వేగ సన్నివేశాల్లోనూ చాలా బాగా నటించాడు. ఇక విక్టరీ వెంకటేష్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. ఇంతకుముందు చూడని వెంకీని ఈ సిరీస్ లో చూస్తాం.

నోటి దూకుడుగా వ్యవహారించే సరికొత్త యాక్టర్​గా ఆయన్ను చూస్తాం. తన నటనాపటిమేంటో ఈ సిరీస్ తో వెంకీ మరోసారి నిరూపించుకున్నాడు. మిగిలిన నటుల్లో రానా భార్యగా నటించిన సుర్వీన్ చావ్లా చక్కగా నటించింది. అభిషేక్ బెనర్జీ పోషించిన జఫ్ఫా క్యారెక్టర్​ను బాగా రాసారు. అతడి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. చివరి నాలుగు ఎపిసోడ్‌లు ఇంట్రెస్టింగ్​గా సాగుతాయి.

మైనస్ పాయింట్స్:

వెంకటేష్ లాంటి స్టార్ హీరో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అది కూడా పాన్ ఇండియా యాక్టర్ రానా దగ్గుబాటితో కలసి నటిస్తుండడంతో ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ను మరో రేంజ్​లో కోరుకుంటారు. కానీ ఈ సిరీస్ ఆ హైప్‌కు తగినట్లుగా లేదనే చెప్పాలి.

ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోవడంలో కొంతమేర ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. మొత్తం మీద రానా నాయుడు క్రైమ్ యాక్షన్ డ్రామా ఫర్వాలేదనిపిస్తుంది. ఆఖర్లో వచ్చే కొన్ని ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా, లాంగ్ రన్ టైమ్ ను విస్మరిస్తే ఈ షోను ఒకసారి చూడొచ్చు.

Read More: Movie Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఎలా ఉందంటే..!

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -