తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం రాజకీయ నాటకంగా మారాలని తాము కోరుకోవడం లేదని వెల్లడించింది. ఈ దర్యాప్తు స్వతంత్రంగా సాగాలని పేర్కొంది.