Saturday, August 30, 2025

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నేత‌లు పాల్గొన్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. ‘సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -