Thursday, January 15, 2026

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

Must Read

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు.‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని ఆయ‌న పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -