వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 25, 26, 27 తేదీల్లో కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ఉంటుంది. ఈ పర్యటన షెడ్యూల్ను పార్టీ అధికారికంగా విడుదల చేసింది. 25వ తేదీ మధ్యాహ్నం బెంగళూరు నుంచి కారు మార్గంలో పులివెందులకు చేరుకున్న జగన్… క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యలు, వినతులు స్వీకరిస్తారు. 26వ తేదీన పూర్తిగా వ్యక్తిగత, ప్రైవేట్ కార్యక్రమాలకు కేటాయించారు. స్థానిక నాయకుల వివాహ వేడుకలు, వ్యక్తిగత భేటీల్లో పాల్గొంటారు. 27వ తేదీన పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు తిరిగి వెళతారు. పర్యటన నేపథ్యంలో పులివెందుల క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

