Thursday, March 12, 2026

పాదయాత్రపై వైయస్ జగన్ కీలక ప్రకటన

Must Read

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల మధ్యే ఉండి, కూటమి పాలన అసమర్థతను చూపించి ప్రజలకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉందని తెలియజేస్తారని జగన్ తెలిపారు. బుధవారం ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమై, నియోజకవర్గ సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై, ఏ వర్గానికి మేలు చేయని పరిస్థితి ఏర్పడిందని, అందులో ప్రజలకు వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, యువత, మహిళలు ఎలాంటి కష్టంలో ఉన్నా పార్టీ వారిపట్ల నిలబడుతుందని, ప్రతి ఇంట్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైపోతోందని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -