Saturday, August 30, 2025

రిగ్గింగ్ చేసేందుకే పోలింగ్ కేంద్రాలు మార్చారా? ఎంపీ అవినాష్ రెడ్డి

Must Read

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పోలింగ్‌ కేంద్రాల మార్పు చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుల వెనుక ఉద్దేశ్యంపై వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, “పోలీసుల సహకారంతో రిగ్గింగ్‌ చేయడానికే పోలింగ్ కేంద్రాలను మార్చారా?” అని ప్రశ్నించారు. నల్గొండవారిపల్లె గ్రామ ఓటర్లు ఇప్పుడు తమ ఓటు వేసేందుకు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. “ఇంతకుముందు సులభంగా ఓటు వేసే కేంద్రాన్ని ఎందుకు మారుస్తారు? ఓటర్ల సౌకర్యం కోసం మార్చడం మేము అంగీకరిస్తాం కానీ, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మార్పులు చేయడం సరికాదు” అని విమర్శించారు. అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, 2020లో ఉన్న విధానాన్నే ఇప్పుడు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఒత్తిడికి లొంగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ, ఆరు పోలింగ్‌ కేంద్రాలు మార్పు చేసిన‌ట్లు తెలిపింది. ఉదాహరణకు, ఎర్రబెల్లి ఎంపీపీ స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రాన్ని నల్లపురెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌కు, అలాగే నల్లపురెడ్డిపల్లి హైస్కూల్‌లో ఉన్న కేంద్రాన్ని ఎర్రబెల్లి ఎంపీపీ స్కూల్‌కు మార్చినట్లు వివరించింది. ఈ మార్పులతో దాదాపు 4,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల 4, 5 తేదీల్లో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన నేపథ్యంలో, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు వేయడానికి ఓటర్లు భయపడుతున్నారని పేర్కొంది. ప్రజలు భయపడకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -