ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో తెలంగాణలో కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్ (వైస్ ప్రెసిడెంట్, AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ), విక్రమ్ శ్రీధరన్ (డైరెక్టర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ), అనురాగ్ ఖిల్నాని (డైరెక్టర్, ప్లానింగ్ అండ్ డెలివరీ) తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు, విస్తరణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది” అని హామీ ఇచ్చారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల సృష్టి, టెక్ ఎకోసిస్టమ్ బలోపేతంలో AWS పాత్రను ఆయన కొనియాడారు. ఈ భేటీ తెలంగాణను గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశలో మరో ముందడుగుగా భావిస్తున్నారు. AWS ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో డేటా సెంటర్ రీజియన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలతో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని అధికార వర్గాలు తెలిపాయి.

