కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందడం ఆందోళనకు కలిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో ఇద్దరు మరణించారని, వారికి కాంటాక్ట్ లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.