జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే జనగామ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతులను దిండిగల్‌కు చెందిన పులమాటి ఓంప్రకాష్, హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

