Friday, August 29, 2025

చైనా విద్యార్థులపై ట్రంప్‌ నిర్ణయం.. బీజింగ్‌ ప్రతిస్పందన

Must Read

అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది. ‘‘అమెరికాలో చదువుకోవాలనుకునే మా విద్యార్థులను స్వాగతిస్తున్న నిర్ణయం అభినందనీయమే. కానీ, అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థులపై అనవసర వేధింపులు, నిరాధార ఆరోపణలు, విచారణలు, స్వదేశానికి పంపించే చర్యలు ఆగాలి. వారికీ చట్టబద్ధమైన హక్కులు, రక్షణలు కల్పించాలి’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు. ట్రంప్‌ గతంలో వలసల విషయంలో కఠిన వైఖరిని అవలంబించారు. భారత్‌ సహా అనేక దేశాల విద్యార్థుల వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ముఖ్యంగా చైనాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, పరిశోధకులకు అమెరికా వీసాలు రద్దు చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చైనా విద్యార్థులకు కొత్తగా ఆహ్వానం పలకడం యూటర్న్‌గా భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న చైనా విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 3.7 లక్షల దాటింది. ట్రంప్‌ వ్యాఖ్యలతో ఇది మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీసా పరిమితులు, భద్రతా తనిఖీలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణపై అమెరికా–చైనా మధ్య కొత్త చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -