మోంథా తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రయాణికుల భద్రత కోసం వందకు పైగా రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే 43 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే 75కు పైగా రైళ్లు రద్దు చేశారు. అక్టోబర్ 27 28 29 30 తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితా ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రయాణికులు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు రద్దు అయ్యాయి. రాజమండ్రి నిడదవోలు గుంటూరు కాకినాడ తెనాలి రేపల్లె మార్కాపురం మచిలీపట్నం నర్సాపూర్ విశాఖ ఒంగోలు భీమవరం మాచర్ల నుంచి రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తారు. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లు రద్దు అయ్యాయి. అత్యవసర సేవలకు ప్రత్యేక రైళ్లు సిద్ధం చేశారు. విశాఖ విజయనగరం శ్రీకాకుళం రోడ్డు దువ్వాడ రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ లు సిద్ధం చేశారు. విమానయాన శాఖ హై అలర్ట్ లోకి వెళ్లింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. షార్జా నుంచి రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. అన్ని విమాన సర్వీసులు నిలిపివేశారు. పలు జిల్లాల్లో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గుంటూరు బాపట్లకు రెడ్ అలర్ట్ పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిర్చి యార్డుకు సెలవులు ప్రకటించారు. స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి. స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో వర్షం మొదలైంది. విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు.


